Venkateswara Suprabhatam – శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం
God Sri Venkateswara Suprabhatam is the divine alarm that wakes up everyone and fills the morning with energy. The Venkateswara Suprabhatam comprises four stages: Suprabhatam, Stothram, Prapatti, and finally, Mangalasasanam. Suprabhatam is addressed to Rama, the fortunate son of the goddess Kausalya.
Shri Venkateswara Suprabhatam – శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం
కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్ 1
తా. కౌసల్యాదేవికి సుపుత్రుడవగు ఓ రామా! పురుషోత్తమా! తూర్పు తెల్లవారుచున్నది. దైవ సంబంధములైన ఆహ్నికములను చేయవలసియున్నది. కావున లెమ్ము.
ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ
ఉత్తిష్ఠ కమలాకాన్త త్రైలోక్యం మంగళం కురు 2
తా. ఓ గోవిందా! లెమ్ము. గరుడధ్వజము కల ఓ దేవా! లెమ్ము. ఓ లక్ష్మీవల్లభా! లెచ్చి ముల్లోకములకును శుభములు కలిగింపుము.
మాతః సమస్త జగతాం మధుకైటభారె:
వక్షో విహారిణి మనోహర దివ్యమూర్తే
శ్రీస్వామిని శ్రితజనప్రియ దానశీలే
శ్రీ వేంకటేశ దయితే తవ సుప్రభాతమ్ 3
తా. సమస్త లోకములకును మాతృదేవతవును, విష్ణుదేవుని వక్షస్థలమందు విహరించుదానవును, మనస్సును ఆకర్షించు దివ్యసుందర స్వరూపము కలదానవును, జగదీశ్వరివిని, ఆశ్రితుల కోరికలను నెరవేర్చుదానవును, శ్రీ వేంకటేశ్వరుని సతీమణివి అగు ఓ లక్ష్మీదేవీ! నీకు సుప్రభాతమగు గాక.
తవ సుప్రభాత మరవిందలోచనే
భవతు ప్రసన్న ముఖచంద్రమండలే
విధిశంకరేన్ద్ర వనితాభిరర్చితే
వృషశైలనాద థయితే దయానిధే. 4
తా. కమలములను పోలు కన్నులును, చంద్రబింబము వలె ప్రసన్నమైన ముఖమును గల ఓ లక్ష్మీదేవీ! నిన్ను సరస్వతి, పార్వతి, శచీదేవి పూజించుచుందురు. శ్రీవేంకటేశ్వరుని సతీమణివి, దయానిధివి అగు నీకు సుప్రభాతమగు గాక.
అత్ర్యాధిసప్తఋషయస్య ముపాస్య సంధ్యం
ఆకాశ సింధు కమలాని మనోహరాణి
ఆదాయ పాదయుగ మర్చయితుం ప్రపన్నాః
శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతమ్ 5
తా. అత్రి మున్నగు సప్తమహర్షులను తమ చక్కని సంధ్యావందనమును ముగించి, ఆకాశగంగ యందలి చక్కని కమలములను తెచ్చి నీ పాదములను చూజించుటకు వచ్చియున్నారు. ఓ వేంకటాచలపతీ! నీకు సుప్రభాతమగు గాక.
… (remaining verses continue in the same format) …
Venkateswara Suprabhatam – శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం
You can download the Venkateswara Suprabhatam | శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం PDF using the link given below to explore the beautiful prayers and rituals. Enjoy your spiritual journey with this PDF download!