
Vemana Padyalu Telugu with Bhavam
వేమన పద్యాలకు సంబంధించిన ఈ పుస్తకం PDF రూపంలో అందుబాటులో ఉంది, ఇది వేదనలో వైవిధ్యాన్ని మరియు తెలుగులో భావాలను అర్థం చేసుకోవడానికి ఒక గొప్ప మార్గం. తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని మరియు తీయదనాన్ని ప్రపంచానికి తెలియచేయడం లో పద్యాలు ప్రధాన భూమికను పోషించాయి. వాటిలో కొన్ని అద్భుతమైన కల్పనలతో, మన రాబోయే తరాలకి ప్రేరణగా నిలిచేలా మనవంతు కృషి చేద్దాం.
Vemana Padyalu in Telugu with Bhavam
పద్యం అమితమైన ప్రేమను కనబరిచినట్లు, అమ్మలా లాలిస్తుంది, నాన్నలా దైర్యం చెపుతుంది, గురువులా సన్మార్గం చూపుతుంది, స్నేహితునిలా సంతోషాన్ని పంచుతుంది. పద్యాన్ని పాఠంలా చెప్పమని నా ఉద్దేశ్యం కాదు, పద్యాన్ని పరిచయం చేయండి చాలు. అదే అవసరం లో ఆసరాగా ఉంటుంది.
పడ్యాలు మరియు భావాలు
- చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు;
కొంచమైనా నదియు కొదువ కాదు;
విత్తనంబు మర్రివృక్షంబునకు నెంత!
విశ్వదాభిరామ! వినురవేమ !
భావం: మనసుపెట్టి చేసే ఏ చిన్న పని అయినా సత్ఫలితాన్నిస్తుంది, మనసు దానిమీద లేకపోతే అది ఫలించదు. మర్రి చెట్టు విత్తనం ఎంత చిన్నదయినా ఏంతో పెద్ద చెట్టయి విస్తరిస్తుంది. కాబట్టి ఏ పనైనా మనసుపెట్టి చేయాలి. - ఉప్పుకప్పురంబు నొక్క పోలిక నుండు;
చూడ చూడ రుచులజాడవేరు;
పురుషులందు పుణ్య పురుషులు వేరయా!
విశ్వదాభిరామ! వినురవేమ !
భావం: ఉప్పు కర్పూరం చూడడానికి ఒకేవిధంగా అంటే తెల్లగా ఉంటాయి, కానీ వాటి రుచిలో వ్యత్యాసం ఉంటుంది. అదే విధంగా మనుషులు అందరూ చూడడానికి ఒకేవిధంగా ఉంటారు కానీ, వారి స్వభవాలు ఒకేవిధంగా ఉండవు. మంచివారు ఉంటారు, చెడ్డవారు ఉంటారు. - అనువుగాని చోట నధికుల మనరాదు;
కొంచె ముండుటెల్ల కొదవుగాదు;
కొండ యద్దమందు కొంచమైయుండదా?
విశ్వదాభిరామ! వినురవేమ !
భావం: అవకాశములేని చోట గొప్ప వారు అని చెపుకోకూడదు. కొండ అద్దం లో చిన్నగా కనిపించినంత మాత్రాన, నిజంగా కొండ చిన్నదై పోతుందా. - ఇనుము విరిగినేని ఇనుమారు ముమ్మారు;
కాచి యతుకనేర్చు గమ్మరీడు;
మనసు విరిగెనేని మరియంట నేర్చునా?
విశ్వదాభిరామ! వినురవేమ !
భావం: ఇనుము రెండుసార్లు విరిగినా దానిని కమ్మరి సులువుగా అతికిస్తాడు, కానీ మనిషి మనసు ఒక్కసారి విరిగితే మళ్ళీ దానిని అతికించడం దేవుని వల్లకూడా కాదు. - మేడి పండు జూడ మేలిమై యుండు;
పొట్టవిప్పి జూడ పురుగులుండు;
పిరికి వాని మదిని బింకమీలాగురా;
విశ్వదాభిరామ! వినురవేమ !
భావం: మేడి పండు చూడడానికి చక్కగా ఎర్రగా ఉంటుంది కానీ దాని పొట్టలో అన్ని పురుగులే ఉంటాయి, అలాగే పిరికివాడు చూడడానికి గంభీరంగా ఉంటున్నా వాడి మదినిండా పిరికితనం ఉంటుంది. - అల్పుడెపుడు బల్కు ఆడంశరంగానూ;
సజ్జనుండు బల్కు చల్లగాను;
కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా;
విశ్వదాభిరామ! వినురవేమ !
భావం: తక్కువ బుద్ధి గలవాడు ఎప్పుడూ గొప్పల్ని చెప్పుకుంటూ ఉంటాడు, మంచి బుద్ధి గలవాడు తక్కువగా మాట్లాడుతాడు. కంచు మోగినట్లు, బంగారం మోగదు గదా. - చంపదగిన యట్టి శత్రువు తనచేత;
చిక్కినేని కీడు చేయరాదు;
పొసగ మేలు చేసి పొమ్మనుటే చావు;
విశ్వదాభిరామ! వినురవేమ !
భావం: చంపదగిన శత్రువు మనకు దొరికినా వాడిని చంపకూడదు, వాడికి మంచి చేసి విడిచిపెడితే చాలు. అదే వాడికి చావుతో సమానం.
మరికొన్ని పద్యాలు
- తల్లిదండ్రుల యడల దయలేని పుత్రుడు;
పుట్టనేమి ? వాడు గిట్టనేమి?
పుట్టలోన చెదలు పుట్టవా !గిట్టవా!
విశ్వదాభిరామ! వినురవేమ !
భావం: తల్లిదండ్రుల మీద దయలేని కుమారుడు పుట్టినా వాడు చచ్చిన వాడితో సమానం. పుట్టలో జన్మించే చెదపురుగులు ఏవిధంగా నిరుపయోగంగా చనిపోతాయో వాడు కూడా అంతే. - గంగిగోవు పాలు గరిటెడైనను చాలు;
కడివెడైననేమి ఖరము పాలు;
భక్తికలుగు కూడు పట్టెడైనను చాలు;
విశ్వదాభిరామ! వినురవేమ !
భావం: మంచి ఆవు బాకీ తాగినా చాలు, గాడిద పాలు కుండనిండుగా తాగినా ఉపయోగం ఉండదు. అదేవిధంగా భక్తితో పెట్టిన కొంచం ఆహారం ఐనా సంతృప్తి నిస్తుంది.
ఈ పద్యాలను మరింత తెలుసుకోండి మరియు మీకు ఆవశ్యకమైన వాటిని PDF ఫార్మాట్‌లో డౌన్లోడ్ చేసుకోండి.
ఇంకా మరెన్నో… వాటిని చదువుదాం, తెలుగు వెలుగును ప్రసరించుదాం. మీకు ఏ అంశం గురించి వ్యాసం కావాలో కామెంట్స్ లో తెలియజేయగలరు.