TDP Manifesto 2024 PDF

1.45 MB / 6 Pages
0 likes
share this pdf Share
DMCA / report this pdf Report
TDP Manifesto 2024
Preview PDF

TDP Manifesto 2024

  • మహానాడు వేదికగా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. 2024 ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధించాలన్న లక్ష్యంతో మిని మ్యానిఫెస్ట్ ని విడుదల చేశారు. ఇప్పటికే ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంతో ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడుతూనే అధికారంలోకి వస్తే ఎలాంటి కార్యక్రమాలు చేపడతామో ప్రజల్లోకి తీసుకేళ్లారు.
  • వీటికి బలం చేకూర్చే విధంగా ఇప్పుడు మిని మ్యానిఫెస్టోని తీసుకుని వచ్చారు. దీనిలో నిరుద్యోగులకు, మహిళలకు, రైతులకు పెద్దపేట వేశారు. దీనికి తోడు తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి కూడా అండగా ఉన్న బీసీలకు కూడా ఈ మ్యానిఫెస్టోలో స్థానం కల్పించారు.
  • మహిళ ‘మహా’ శక్తి… ఆది నుంచి కూడా తెలుగుదేశం పార్టీ మహిళలకు అండగా నిలుస్తోంది. ఈ క్రమంలోనే మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు మహాశక్తి పేరుతో పథకాన్ని తీసుకుని వస్తామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపడుచులకి “స్త్రీనిధి” కింద నెలకు 1500 రూపాయలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తామని పేర్కొన్నారు.
  • దీనితో పాటే ‘తల్లికి వందనం’ పథకం కింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికీ ఏడాదికి రూ.15,000లు అందించేలా తెలుగుదేశం హామీ ఇస్తున్నట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించారు. “దీపం” పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణియించారు. “ఉచిత బస్సు ప్రయాణం” పథకం ద్వారా స్థానిక బస్సుల్లో మహిళలందరికీ టికెట్టులేని ప్రయాణ సౌకర్యం కలిగిస్తుంది తెలుగుదేశం ప్రభుత్వం.
  • మినీ మ్యానిఫెస్ట్ లో భాగంగా చంద్రబాబు నాయుడు రిచ్ టూ పూర్ అనే పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఈ పథకం తో పేదలను సంపన్నులను చేసే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ముందడగు వేయనుంది. ఐదేళ్ళలో పేదల ఆదాయాన్ని రెట్టింపు చేసేలా టీడీపీ భవిష్యత్తు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది
  • వైఎస్సార్సీపీ హయాంలో 26 మందికి పైగా బీసీలు హత్యకు గురైయ్యారు. 650 మంది నాయకులపై తప్పుడు కేసులు పెట్టారు. రాష్ట్రంలో 43 మందికి పైగా ముస్లిం మైనార్టీలపై దాడులు జరిగాయి. వీటిలో దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం బీసీలకు రక్షణ చట్టాన్ని కల్పిస్తోంది. వారికి అన్ని విధాలా అండగా నిలిచేలా ఈ చట్టాన్ని తీసుకుని వస్తోంది.
  • చంద్రబాబుగారి ప్రభుత్వం అధికారంలోకి రాగానే “ఇంటింటికీ మంచి నీరు” పథకం కింద ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్ ఇస్తుంది తెలుగుదేశం. రాష్ట్రంలో అన్నదాత పథకం కింద ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి రైతుకు ఏడాదికి 15,000 రూపాయల ఆర్థిక సాయం అందించాలని తెలుగుదేశం నిర్ణయించింది.

Download TDP Manifesto 2024 PDF

Free Download
Welcome to 1PDF!