ఒక యోగి ఆత్మకథ – Oka Yogi Atma Katha PDF

49.9 MB / 935 Pages
0 likes
share this pdf Share
DMCA / report this pdf Report
ఒక యోగి ఆత్మకథ – Oka Yogi Atma Katha

ఒక యోగి ఆత్మకథ – Oka Yogi Atma Katha

మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి. అన్ని భావోద్వేగాలూ మన శరీరంలో, మనసులో ప్రతిఫలిస్తాయి. అసూయ, భయం కారణంగా ముఖం కళావిహీనం అవుతుంది. ప్రేమ దాన్ని ప్రకాశించేలా చేస్తుంది. – పరమహంస యోగానంద

ఒక యోగి ఆత్మకథ! ఈ పేరు వినగానే దాని రచయిత పరమహంస యోగానంద కూడా స్ఫురిస్తారు. స్వామి వివేకానంద తరువాత, పాశ్చాత్య దేశాలలో భారతీయ సంస్కృతికి మరింత గౌరవాన్ని ఇనుమడింపచేసిన వ్యక్తి యోగానంద. చిన్నప్పటి నుంచి అలౌకికమైన సంపద కోసం, అంతులేని ప్రశాంతత కోసం తపించినవారు. తన గురువు స్వామి యుక్తేశ్వర్‌ను కలుసుకున్నాక కానీ ఆయన వెతుకులాట ఓ కొలిక్కి రాలేదు. ఈ మధ్యలో ఎందరో సాధువులు, మర్మయోగులు ఆయనకు తారసిల్లారు. అలాంటి ఒక సందర్భంలో కోల్‌కతాలోని కాళీఘాట్‌లో ఆయనను ఓ సాధువు కలిశారు. ఆ సమయంలో యోగానందతో సాధువు అన్న కొన్ని మాటలు చాలా విలువైనవిగా అనిపిస్తాయి. అవేమిటంటే…

Oka Yogi Atma Katha in Telugu

‘నేను చాలాకాలం చిత్తశుద్ధిగా అంతఃపరిశీలనను అభ్యసించాను; జ్ఞానార్జనకు అత్యంత బాధాకరమైన మార్గమిది. ఆత్మ పరీక్ష చేసుకోవడం, తన ఆలోచనలను నిర్విరామంగా పరిశీలన చేసుకోవడం కఠోరమైన విదారక అనుభవం. అత్యంత ప్రబలమైన అహంకారాన్ని సైతం అది నుగ్గు చేస్తుంది…’

‘మనిషి బడాయిల్లోంచి బయటపడేవరకు శాశ్వత సత్యాన్ని అర్థం చేసుకోలేడు. అనేక శతాబ్దాలుగా పంకిలమైన ఉన్న మానవ మనస్సు లెక్కలేనన్ని ప్రపంచమాయలతో కూడిన దుర్భర జీవితాన్ని సృష్టిస్తోంది. మనిషి మొదట, తనలోని శత్రువులతో జరిపే పెనుగులాట ముందు, యుద్ధభూమిలో జరిగే పోరాటాలు తీసికట్టే అనిపిస్తాయి!’

‘సంకుచితమైన తన కష్టంలోనే మునిగిపోయి, ఇతరుల జీవితాల్లోని దుఃఖాలకు స్పందించే శక్తిని కోల్పోయినవాడు లోతులేని మనిషి. శస్త్రంతో మాదిరిగా సునిశితంగా ఆత్మపరిశీలనను అభ్యసించినవాడు, మొత్తం మానవాళి పట్ల జాలి పెరుగుతూ ఉండటం గమనిస్తాడు. చెవులు ఊదరగొడుతూ, అధికార పూర్వకంగా అహంకారం వెల్లడించే కోరికల నుంచి అతనికి విముక్తి కలుగుతుంది,’ ఈ మాటలు చెబుతూ తరతరాల ఆధ్మాత్మిక వారసత్వాన్ని పుణికిపుచ్చుకోమని యోగానందను దీవిస్తూ ఆ సాధువు తన దారిన సాగిపోయాడు. కానీ ఆయన చెప్పిన మాటలు మాత్రం యోగానంద మీద తీవ్ర ప్రభావం చూపాయి. తరువాతి కాలంలో మార్గదర్శకంగా నిలిచాయి.

ఒక యోగి ఆత్మకథ ప్రముఖ భారతీయ యోగి పరమహంస యోగానంద రచించిన సంచలన ఆధ్యాత్మిక రచన. ఇందులో ఆయన ఆత్మకథను పొందుపరిచాడు. ఈ పుస్తకం ఎంతో మంది విదేశీయులకు యోగాను, ధ్యానాన్ని పరిచయం చేసింది. ఇప్పటి దాకా దాదాపు 25 భాషల్లోకి అనువదించబడింది. ఆయన రచించిన పుస్తకాలన్నింటిలో ఈ పుస్తకం ఎక్కువ ప్రాచుర్యం పొందింది.

ఈ పుస్తకంలో ప్రధానంగా యోగానంద తన గురువు కోసం అన్వేషణ, ఆ ప్రయత్నంలో భాగంగా ఆయనకు ఎదురైన ఆధ్యాత్మిక అనుభవాలు, అప్పట్లో పేరు గాంచిన ఆధ్యాత్మిక వేత్తలైన థెరెసా న్యూమన్, శ్రీ ఆనందమయీ మా, మహాత్మా గాంధీ, రవీంద్రనాథ్ ఠాగూర్, నోబెల్ బహుమతి గ్రహీతయైన సి.వి. రామన్, అమెరికాకు చెందిన శాస్త్రజ్ఞుడు లూథర్ బర్బాంక్ మొదలైన వారితో గడిపిన ముఖ్యమైన ఘట్టాలు నిక్షిప్తం చేయబడ్డాయి. ఆయన గురువైన యుక్తేశ్వర్ గిరితో అనుబంధం, గురు శిష్యుల మధ్య సంబంధాల గురించి కూడా వివరాలు ఇందులో పొందుపరచబడ్డాయి. ఆయన ఈ పుస్తకాన్ని వీరికే అంకితం చేశాడు.

యోగానంద పిన్న వయసులోనే భారతదేశంలోని గొప్ప యోగులను కలవడం తటస్థించింది. ఉన్నత పాఠశాల విద్య పూర్తి కాకముందే ఆయన కనబరిచిన అనేక ఆధ్యాత్మిక శక్తులను, గురువు దగ్గర ఆయన శిక్షణ గురించిన విశేషాలు యోగానంద తమ్ముడైన సనంద లాల్ ఘోష్ రచించిన పుస్తకంలో సవివరంగా వివరించబడ్డాయి.

బాల్యంలోనే ఆధ్యాత్మికత వైపు మొగ్గు ఆధ్యాత్మిక ప్రభావాలు, వారసత్వం గురుశిష్య సంబంధాలు క్రియాయోగం

పునర్ముద్రణలు
ఆయన జీవిత కాలంలో ఈ పుస్తకం మూడు ఎడిషన్లు వెలువడింది. మొదటిది 1946లో, రెండవది 1949లో, మూడవది 1951లో వెలువడ్డాయి

You can download the Oka Yogi Atma Katha Telugu PDF using the link given below.

Download ఒక యోగి ఆత్మకథ – Oka Yogi Atma Katha PDF

Free Download
Welcome to 1PDF!