శ్రీ ఆంజనేయ దండకం – Anjaneya Dandakam Telugu
Sri Anjaneya Dandakam is the compilation of poetic recitations in praise of lord hanuman. The original script is in Telugu. Invariably it is recited in most Telugu Hindu households as one of the daily prayers.
This stotram is also commonly recited whenever & wherever there is fear or loneliness or trepidation on the strong unshakable belief that Lord Anjaneya will dispel all the worries and provide protection.
శ్రీ ఆంజనేయ దండకం – Anjaneya (Hanuman) Dandakam Telugu
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం
ప్రభాదివ్యకాయం ప్రకీర్తిప్రదాయం
భజే వాయుపుత్రం భజే వాలగాత్రం
భజే హం పవిత్రం భజే సూర్యమిత్రం
భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం
బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్నీనామ సంకీర్తనల్ చేసి
నీ రూపు వర్ణించి, నీ మీద నే దండకం బొక్కటింజేయ నూహించి,
నీ మూర్తినిన్ గాంచి, నీ సుందరం బెంచి,
నీ దాస దాసుండనై, రామ భక్తుండనై,
నిన్ను నే గొల్చెదన్, నీ కటాక్షంబునన్ జూచితే, వేడుకల్ చేసితే,
నా మొరాలించితే, నన్ను రక్షించితే,
అంజనాదేవిగర్భాన్వయా! దేవ! నిన్నెంచ నేనెంత వాడన్
దయాశాలివై చూచితే, దాతవై బ్రోచితే, దగ్గరన్ నిలిచితే,
తొల్లి సుగ్రీవునకున్ మంత్రివై స్వామి కర్యంబు నందుండి, శ్రీరామసౌమిత్రులం జూచి,
వారిన్ విచారించి, సర్వేశు పూజించి, యబ్బానుజున్ బంటుగావించి,
యవ్వాలినిన్ జంపి, కాకుస్థతిలకున్ దయా దృష్ఠి వీక్షించి, కిష్కిందకేతెంచి,
శ్రీరామ కర్యార్థివై, లంకకేతెంచియున్, లంకిణింజంపియున్, లంకనున్ గాల్చియున్,
భూమిజన్ జూచి, యానందముప్పొంగ, యాయుంగరంబిచ్చి, యారత్నమున్ దెచ్చి,
శ్రీరాముకున్నిచ్చి, సంతోషనున్ జేసి,
సుగ్రీవునుం అంగదున్ జాంబవంతాది నీలాదులున్ గూడి,
యాసేతువున్ దాటి, వానరుల్ మూకలై, దైత్యులన్ ద్రుంచగా,
రావణుడంత కాలాగ్ని ఉగ్రుండుడై, కోరి, బ్రహ్మాండమైనట్టి యాశక్తినిన్ వేసి,
యా లక్ష్మణున్ మూర్ఛనొందింపగ నప్పుడేపోయి సంజీవనిన్ దెచ్చి,
సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా, కుంభకర్ణాది వీరాదితో పోరాడి,
చెండాడి, శ్రీరామబాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబులానందమైయుండనవ్వేళనన్,
నవ్విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి, పట్టాభిషేకంబు చేయించి,
సీతామహాదేవినిన్ దెచ్చి, శ్రీరాముకున్ ఇచ్చి,
అయోద్యకున్ వచ్చి, పట్టాభిషేకంబు సం రంభమైయున్న
నీకన్ననాకెవ్వరున్ గూర్మిలేరంచు మన్నించినన్
రామభక్తి ప్రశస్థంబుగా నిన్ను నీనామసంకీర్తనల్ చేసితే
పాపముల్ బాయునే భయములున్ దీరునే
భాగ్యముల్ గల్గునే సకలసామ్రాజ్యముల్ సకలసంపత్తులున్ గల్గునే
వానరాకార! యోభక్తమందార! యోపుణ్యసంచార! యోధీర! యోశూర!
నీవే సమస్తంబు నీవే మహాఫలంబుగా వెలసి యాతారకబ్రహ్మ మంత్రంబు పఠియించుచున్ స్థిరముగా వజ్రదేహంబునున్ దాల్చి,
శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూతమై యెప్పుడున్ తప్పకన్ తలచు
నాజిహ్వయందుండి నీదీర్ఘదేహంబు త్రైలోక్యసంచారివై,
శ్రీరామ నామాంకితధ్యానివై బ్రహ్మవై, బ్రహ్మ తేజంబంటచున్ రౌద్ర నీ జ్వాల కల్లోల హావీర హనుమంత!
ఓంకారహ్రీంకార శబ్దంబులన్ భూతప్రేతపిశాచంబులన్,
గాలి దయ్యంబులన్, నీదు వాలంబునన్ జుట్టి నేలంబడంగొట్టి
నీముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి, కాలాగ్ని రుద్రుండవై
బ్రహ్మప్రభా భాసితంబైన నీదివ్యతేజంబునన్ జూచి, రారా నాముద్దు నరసింహాయంచున్,
దయాదృష్ఠివీక్షించి, నన్నేలు నాస్వామీ!
నమస్తే సదా బ్రహ్మచారీ నమస్తే!
వాయుపుత్రా నమస్తే!
నమస్తే
నమస్తే
నమస్తే నమస్తే నమస్తే నమః
శ్రీ కృష్ణా అష్టోత్తరం
శ్రీ అయ్యప్ప స్వామి అష్టోత్తరం
శ్రీ నరసింహ అష్టోత్తరం
శ్రీ పద్మావతి అష్టోత్తరం
గోవింద నామాలు
అన్నపూర్ణ అష్టోత్తరం
శ్రీ కుబేర అష్టోత్తరం
శ్రీ సత్యనారాయణ స్వామి అష్టోత్తరం
మరిన్ని స్తోత్రాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Download the Anjaneya Dandakam | శ్రీ ఆంజనేయ దండకం PDF using the link given below.