AP Budget 2024-25 PDF

0.23 MB / 44 Pages
0 likes
share this pdf Share
DMCA / report this pdf Report
AP Budget 2024-25
Preview PDF

AP Budget 2024-25

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను అసెంబ్లీలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం సంక్షేమానికి పెద్ద పీట వేస్తూనే అభివృద్ధికి కూడా భారీగా నిధులు కేటాయించింది.

బడ్జెట్‌లో బీసీ సంక్షేమానికి ఏకంగా రూ.71,740 కోట్లు కేటాయించి రికార్డు సృష్టించింది ప్రభుత్వం. బీసీల కోసం ఇప్పటికే ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్లకు ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. రూ.20 వేల కోట్లతో రాష్ట్రంలో నాలుగు ఓడ రేవుల నిర్మాణం చేపట్టనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. కొత్తగా నిర్మించనున్న ఈ ఓడ రేవుల ద్వారా 75 వేల మంది కొత్తగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

AP Budget 2024 25 Highlights

  • రూ.2,86,389 కోట్లతో ఏపీ బడ్జెట్‌
  • రెవెన్యూ వ్యయం – రూ. 2,30,110 కోట్లు
  • మూలధన వ్యయం – రూ. 30,530 కోట్లు
  • ద్రవ్యలోటు – రూ.55,817 కోట్లు, జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు 3.51 శాతం
  • రెవెన్యూ లోటు రూ.24,758 కోట్లు
  • ఐదేళ్లపాటు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించింది. సహకరించిన అందరికీ ధన్యవాదాలు.
  • ఐదేళ్ల క్రితం మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు.. మేనిఫెస్టోను జగన్ పవిత్ర గ్రంథంగా ప్రకటించారని చెప్పాను.
  • వైఎస్ రాజశేఖర రెడ్డి నిబద్ధత మా పాలనలో ప్రతిఫలించింది.
  • అర్ధశాస్త్రంలో కౌటిల్యుడు పేర్కొన్న విధంగానే జగన్ పాలన సాగింది.
  • ఇప్పటి వరకూ ఎవరూ చేయని పనులను జగన్ సర్కారు చేసింది.
  • 1.35 లక్షల మంది ఉద్యోగులతో గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశాం.
  • వాలంటీర్ల నియామకం ద్వారా సంక్షేమ పథకాలను గడప గడపకూ అందిస్తున్నాం.
  • కుప్పం సహా అనేక కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశాం.
  • కుప్పం పోలీస్ సబ్ డివిజన్‌ను ఆరు పోలీస్ స్టేషన్లతో ఏర్పాటు చేశాం. అందర్నీ సమానంగా చూశామని చెప్పడానికి ఇదే నిదర్శనం.
  • ప్రతి జిల్లాలో దిశా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశాం.
  • 99.81 శాతం పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాం.
  • ఆరోగ్య రంగంలో నాడు-నేడు పథకం అమలు కోసం రూ.16 వేల కోట్లకుపైగా ఖర్చు చేశాం.
  • ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రూ.25 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలను అందిస్తున్నాం. క్యాన్సర్ వంటి వ్యాధులకు ఎలాంటి పరిమితి లేదు.
  • ఫ్యామిలీ డాక్టర్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
  • అమ్మఒడి పథకం ద్వారా 43.61 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.26,067 కోట్లు జమ చేశాం. ఈ పథకం వల్ల 83 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది.
  • స్వయం సహాయక బృందాలకు వైఎస్ఆర్ ఆసరా కింద 2019 నుంచి రూ.25,571 కోట్ల బకాయిలను చెల్లించాం.
  • వైఎస్సార్ సున్నా వడ్డీ కింద స్వయం సహాయక బృందాలకు రూ.4,969 కోట్లు పంపిణీ చేశాం.
  • గత ఐదేళ్లలో 30.65 లక్షలకుపైగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశాం.
  • సుమారు రూ.33 వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం.
  • వైఎస్సార్ పెన్షన్ కానుక లబ్ధిదారుల వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించాం. జనవరి నుంచి నెలకు రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్నాం. ఆరోగ్య ఫించన్లను రూ.10 వేలకు పెంచాం.
  • రూ.20 వేల కోట్లతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడల్లో ఓడరేవులను నిర్మించాం. వీటి ద్వారా దాదాపు 75 వేల మందికి ఉపాధి లభించనుంది.
  • రూ.3800 కోట్లతో పది చోట్ల ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం.
  • గత ఐదేళ్లలో రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ. 2626 కోట్లు, జిల్లా రహదారుల అభివృద్ధికి రూ.1955 కోట్లు ఖర్చు చేశాం.

Download AP Budget 2024-25 PDF

Free Download
Welcome to 1PDF!